Wed Mar 18 2026 18:22:07 GMT+0530 (India Standard Time)
కరోనా కేసులు ఈరోజు ఎన్నంటే?
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35మంది మరణించారు.. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,85,534 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇరవై వేలకు దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 15,378 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,21,982 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,070 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,83,53,90,407 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

