Wed Mar 18 2026 18:22:07 GMT+0530 (India Standard Time)
ఇండియా కరోనా అప్డేట్
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించారు.. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,87,410 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పదిహేను వేలకు దిగువన...
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. చాలా రోజుల తర్వాత పదిహేను వేలకు దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 14,704 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,23,215 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,101 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,83,82,41,743 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. పాజిటివిటీ రేటు 0.20 శాతంగా ఉంది.
Next Story

