Thu Mar 19 2026 17:39:48 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు కూడా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా కొంత తగ్గాయి ఈరోజు కొత్తగా 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా కొంత తగ్గాయి ఈరోజు కొత్తగా 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నాలుగువేల కేసులు తగ్గాయి. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 525 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,65,01,435మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,92,03,748 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,89,302 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,62,66, 44674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

