Wed Mar 18 2026 15:18:10 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,25,02,454 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్...
యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 11,365 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,35,271 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,685 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,85,70,71,655 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదయింది.
Next Story

