Wed Mar 18 2026 21:39:51 GMT+0530 (India Standard Time)
తొలి సారి రెండువేలకు దిగువన కేసులు
భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.127 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.127 మంది మరణించారు. తొలిసారి రెండు వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం నిన్నటికంటే కొంత పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,65,122 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 26,240 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,03,161 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,479 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,81,21,11,675 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

