Wed Mar 18 2026 21:35:06 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.31 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.31 మంది మరణించారు. రెండోరోజు కూడా రెండు వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా యాభై లోపే ఉండటం విశేషం. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,67,774 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 25,106 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,09,390 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,510 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,81,24,97,303 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

