Thu Mar 19 2026 02:10:03 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. ఈరోజు కొత్తగా 3,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

ఇండియా : భారత్ లో కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. ఈరోజు కొత్తగా 3,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 108 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,06,150 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 49,948 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,71,308 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,210 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,13,41,295 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

