Mon Dec 08 2025 19:57:21 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ రిలీఫ్.. భారత్ లో కరోనా తగ్గుముఖం
భారత్ లో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 14,830 మంది కరోనా వైరస బారిన పడ్డారు

భారత్ లో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 14,830 మంది కరోనా వైరస బారిన పడ్డారు. 36 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్కరోజులో 18,159 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. కేసులు తగ్గుముఖం పట్టాయని అజాగ్రత్తగా ఉండొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ దేశంలో 4,39,20,471 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 4,32,46,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 5,26,110 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కల్గించే అంశమే. ఇప్పటి వరకూ 2,02,50,57,717 కరోనా వ్యాక్సిన్ టీకాలను అందించినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story

