Mon Mar 09 2026 14:22:39 GMT+0530 (India Standard Time)
కేసులు తగ్గుతున్నాయ్.. డెత్స్ డేంజర్ బెల్స్
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు మరణాల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళన కల్గిస్తుంది. ఈరోజు 1,733 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,95,11,307 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తగ్గుతున్న యాక్టివిటీ కేసులు...
ప్రస్తుతం దేశంలో 16,21,603 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,16,30,885 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,97,975 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,67,03,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

