Tue Dec 09 2025 10:09:06 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో 7,584 కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో 7,584 కేసులు నమోదయ్యాయి. 24 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్కరోజు 3,761 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అలాగే రోజువారి పాజిటివటీ రేటు కూడా బాగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
ఇన్ని కేసులా?
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ భారత్ లో 4,31,97,866 కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది. ఇందులో 5,24,747 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 36,267 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,44,092 గా ఉంది. మరణాల శాత 1.21గా నమోదయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ దేశంలో 1,94,76,42,992 డోసులు వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

