Wed Mar 18 2026 18:18:22 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ప్రతి రోజూ తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు ప్రతి రోజూ తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది మరణించారు.. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,89,004 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పదిహేను వేలకు దిగువన...
యాక్టివ్ కేసులు బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 14,307 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,24,440 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,129 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,84,06,55,005 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. పాజిటివిటీ రేటు 0.20 శాతంగా ఉంది.
Next Story

