Wed Mar 18 2026 10:27:03 GMT+0530 (India Standard Time)
భారత్లో కరోనా మాయం
భారత్లో కరోనా కేసులు బాగా తగ్గాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వాలు కొంత ఉపశమనం పొందాయి.

భారత్లో కరోనా కేసులు బాగా తగ్గాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వాలు కొంత ఉపశమనం పొందాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 1,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయినా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని మాత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.
యాక్టివ్ కేసులు...
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ భారత్లో 22,742 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కారణంగా పదిహేను మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులుచెబుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story

