Thu Mar 19 2026 03:32:42 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 223 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,23,38,673 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 85,680 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 42,938,599 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,14,246 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,77,79,92,97 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

