Thu Mar 19 2026 09:27:33 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన కేసులు.. ఆగని మరణాలు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు నాలుగు వేలు అధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు 1,217 మంది మరణించారు. మరణాల సంఖ్య బాగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,10,12,869 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు తగ్గుతున్నా.....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 8,92,828 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,24,10,976 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,05,279 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది.
Next Story

