Thu Mar 19 2026 00:46:25 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 4,575 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 145 మంది మరణించారు.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 4,575 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 145 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కరోనా కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,13,566 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 46,962 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,75,883 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,355 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,33,99,555 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు
Next Story

