Thu Mar 19 2026 00:49:29 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 4,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 255 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 4,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 255 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా నిన్నటి కంటే పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,26,328 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 42,219 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 42,984,261 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,714 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,72,00,515 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. భారత్ లో కరోనా రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
Next Story

