Wed Mar 18 2026 23:21:41 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మరణించారు. వరసగా మూడో రోజూ భారత్ లో మూడు వేల దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,50,055 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 32,811 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,98,938 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,072 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,80,60,93,107 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

