Wed Mar 18 2026 16:47:01 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది మరణించారు.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,98,789 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 11,492 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,33,067 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,573 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,85,38,86,260 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదయింది.
Next Story

