Wed Mar 18 2026 20:07:24 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 62 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 62 మంది మరణించారు. నిన్నటి కంటే కరోనా కేసుల సంఖ్య రెండు వందలకు పైగా పెరిగింది. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,73,057 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరణాలు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 23,087 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,12,749 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,605 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,81,89,15,234 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

