Wed Mar 18 2026 16:43:35 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

ఇండియా : భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71 మంది మరణించారు. కరోనా కేసులతో పాటు ఈరోజు మరణాల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,97,567 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 12,054 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 43,030,925 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,487 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,85,04,86,260 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదయింది.
Next Story

