Thu Mar 19 2026 05:04:37 GMT+0530 (India Standard Time)
India Corona : భారత్ లో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు కొత్తగా 14,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 302 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు కొత్తగా 14,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 302 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,22,19,896 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,48,359 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,28,81,179 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,12,924 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,76,52,31,385 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

