Thu Mar 19 2026 14:26:10 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుముఖం పడుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా 2,51,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా 2,51,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుతోంది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 627 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,80,24,771 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తగ్గిన యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 21,05,611 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,06,22,709 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,92,327 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15,88 శాతంగా ఉంది.
Next Story

