Sat Mar 07 2026 22:28:57 GMT+0530 (India Standard Time)
గ్రేట్ రిలీఫ్... కరోనా కేసులు అట్టడుగుకు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 657 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 657 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 6,97,802 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 6,97,802 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,25,36,137 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,07,177 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,71,79,51,432 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగిదంి.
Next Story

