Thu Mar 19 2026 07:58:34 GMT+0530 (India Standard Time)
తగ్గిన కేసులు.. ఆగని మరణాలు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 804 మంది మరణించారు. మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్నటితో పోలిస్తే నాలుగు వేల కేసులు తగ్గాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 6,10,443 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 6,10,443 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,25,86,544 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,07,981 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,72,29,47,688 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
- Tags
- coronavirus
- india
Next Story

