Thu Mar 19 2026 00:46:49 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 3,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 3,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 89 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా నిన్నటి కంటే బాగా తగ్గింది.. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,31,513 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 40,559 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 42,987,875 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,803 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,91,57,486 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. భారత్ లో కరోనా రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
Next Story

