Thu Mar 19 2026 07:58:34 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 27,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 347 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 27,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 347 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,17,60,458 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,26,65,534 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,09,358 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది
Next Story

