Thu Mar 19 2026 06:27:32 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్... భారత్ భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 25,920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 492 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 25,920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 492 మంది మరణించారు. దాదాపు రెండు నెలల తర్వాత 25 వేల కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,19,77,238 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టెస్ట్ ల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,27,80,235 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,10,905 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,74,64,99,461 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

