Thu Mar 19 2026 02:11:32 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 6,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 6,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 201 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,23,67,070 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 69,897కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,44,995 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,14,589 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,78,02,63,222 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

