Thu Mar 19 2026 02:11:31 GMT+0530 (India Standard Time)
తొలిసారి ఐదు వేలకు దిగువన కేసులు
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 4,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలల తర్వాత ఐదు వేలకు దిగువన దేశంలో కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా చాలా రోజుల తర్వాత వందకు లోపు నమోదయింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,23,98,095 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరణాల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 54,118 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,62,953 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,102 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,78,90,61,887మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

