Thu Mar 19 2026 14:26:09 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా అప్ డేట్
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2.34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2.34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరసగా మూడు రోజుల నుంచి కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్య మాత్రం పెరగడం ఆగలేదు. 893 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,89,60,710 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు..
ప్రస్తుతం దేశంలో 18,84,937 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,10,58,241 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,94,101 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,66,58,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

