Tue Dec 09 2025 10:14:53 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. భారత్ లో ఇన్ని కేసులా?
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7,240 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజు 3,591 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య, రోజు వారీ పాజిటివిటీ శాతం పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
ఒక్కరోజులోనే...?
ఒక్కరోజులోనే దేశంలో కరోనా కేసులు 40 శాతం పెరిగాయి. దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,90,282 గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,24,723 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 32,498 గా ఉంది. కోరోనా బారిన పడి 4,26,40,301 మంది ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కోలుకున్నారు. వ్యాక్సినేషన్ వేగం పెంచారు. ఇప్పటి వరకూ 1,94,59,81,691 డోసులను పంపిణీ చేశారు
Next Story

