Mon Mar 30 2026 12:58:17 GMT+0530 (India Standard Time)
భారత్ కు మళ్లీ ముప్పు.. పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు.

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఫోర్త్ వేవ్ వస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కరోజులో 4,143 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
యాక్టివ్ కేసులు.....
భారత్ లో ఇప్పటి వరకూ 4,32,14,777 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,24,761 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 44,513 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,26,52,743గా ఉంది. రోజువారీ పాజిటివిటీ శాతం 2.71 కు పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ దేశంలో 1,95,07,08,541 వ్యాక్సిన్ డోసులు వేశారు.
Next Story

