Thu Mar 19 2026 06:27:53 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 30,615 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 30,615 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 514 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,18,43,446 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టెస్ట్ ల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,70,240 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,27,23,558 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,09,872 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 2.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 75,42,84,979 మందికి కరోనా పరీక్షలు చేశారు.
Next Story

