Thu Dec 11 2025 01:35:31 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. నిన్న కొంత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు నేడు మళ్లీ పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మహారాష్ట్ర, కేరళలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 4,270 మందికి కరోనా సోకింది. పదిహేను మంది కరోనా కారణంగా చనిపోయారు. అయితే 2,619 మంది కరోనా నుంచి కోలుకుని నిన్న డిశ్చార్జ్ అయ్యారు.
యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,31,76,817 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా సోకి 5,24,692 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 24,052గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా బారిన పడి ఇంత వరకూ దేశ వ్యాప్తంగా 4,26,28,073 మంది కోలుకున్నారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకకూ 1,94,09,46,157 డోసులు వేశారు.
Next Story

