Mon Jul 04 2022 05:45:31 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను మళ్లీ వణికిస్తున్న కరోనా

కరోనా కేసులు భారత్ లో వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 13,313 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది కరోనా కారణంగా మరణించారు. రోజువారీ పాజిివీటీ రేడు 3.94 గా నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. గత కొంతకాలంగా భారత్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను ప్రజలు పెడచెవిన పెట్టడమే దీనికి కారణమంటున్నారు వైద్య నిపుణులు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఉంటే కేసులు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం కరోనా వ్యాప్తి మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా మిగిలిన రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 81,687కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,24,941 కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 0.19 శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం కోలుకుంటున్న వారి శాతం 98.60 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story