Sun Mar 15 2026 23:29:42 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఆగని కరోనా.. ఈరోజు కూడా?
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 33,750 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 33,750 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 123 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే మరణాల సంఖ్య కొంత తగ్గింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,49,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో 1,45,582 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,93,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,81,893 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,45,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

