Wed Jul 16 2025 23:18:26 GMT+0000 (Coordinated Universal Time)
Covid : భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు ఎన్నంటే?
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో 1,010 క్రియాశీల కేసులు నమోదుఅయినట్లు తెలిపింది. కొత్త వేరియంట్లు ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7 ల గుర్తించారు. అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కవగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండాల్సిందే...
రోగనిరోధక శక్తి తగ్గడం, వాతావరణ మార్పులే కారణాలని వైద్య నిపుణులు చెబుతన్నారు. పరీక్షలు పెంచి, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు బయట నుంచి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
Next Story