Wed Mar 18 2026 23:20:46 GMT+0530 (India Standard Time)
ఇండియా కరోనా అప్ డేట్
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 2,568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది మరణించారు. వరసగా రెండో రోజూ భారత్ లో మూడు వేల దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,46,171 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 33,917 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,96,062 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,974 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,80,40,28,891 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

