Wed Mar 18 2026 20:06:15 GMT+0530 (India Standard Time)
ఇండియా కరోనా అప్డేట్
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 1,581 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 1,581 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 మంది మరణించారు. రెండోరోజు కూడా రెండు వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా యాభై లోపే ఉండటం విశేషం. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,70,515 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరణాలు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 23,913 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,10,971 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,543 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,81,56,01,944 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

