Sat Dec 06 2025 00:05:26 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాన్స్ జెండర్ పై చేయి చేసుకున్న పోలీసు
తిరువళ్లూరులోని మురుగన్ ఆలయం వెలుపల భక్తులను

తమిళనాడులోని తిరువళ్లూరులోని మురుగన్ ఆలయం వెలుపల భక్తులను క్యూలైన్ లో పంపిస్తూ ఉండగా ఒక ట్రాన్స్ జెండర్ మహిళపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) దాడి చేయడం కెమెరాలో రికార్డు అయింది. సిరువపురి మురుగన్ ఆలయంలో థాయ్ పూసం వేడుకలో ఈ సంఘటన జరిగింది. దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రద్దీని అదుపు చేసేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.
సాధారణ భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండగా, వీఐపీలకు ప్రత్యేక ప్రవేశం కల్పిస్తున్నారంటూ ట్రాన్స్ జెండర్ల సమూహం నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి. ఉత్తుకోట్టై డీఎస్పీ కే.శాంతి జోక్యం చేసుకున్నప్పటికీ ఓ ట్రాన్స్జెండర్ మహిళను చెంపదెబ్బ కొట్టడం కెమెరాలో రికార్డు అయింది. డీఎస్పీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆ అధికారిని సంఘటనా స్థలం నుండి పంపించేశారు. థాయ్ పూసం వేడుకల కారణంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకోవాలని నిరసనలు విరమించాలని పోలీసులు కోరారు.
Next Story

