Sat Dec 07 2024 21:40:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ నుంచి నేతలు హాజరుకానున్నారు
నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. . ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు. హాజరుకానున్నారు. వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఈవీఎంలపై చర్చ జరగనుంది.
తెలుగు రాష్ట్రాల నేతలు...
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి దామోదర్ రాజనరసింహ, చల్లా వంశీ చందర్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజులు హాజరు కానున్నారు.
Next Story