Sat Dec 27 2025 04:31:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో జరగనున్న ఈ కీలక సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చి వీబీ-జీ-రామ్ జీ చట్టాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ పథకం అమలుపై లోపాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించనున్నారు.
ఉపాధి హామీ చట్టంపై...
ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ చట్టంపై ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్ లు, ముఖ్య నేతలతో ఈ సమావేశం జరగనుంది. దీంతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి దామోదర రాజనర్సింహలు కూడా నిన్ననే ఢిల్లీలో చేరుకున్నారు.
Next Story

