Thu Apr 09 2026 14:58:47 GMT+0530 (India Standard Time)
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మహిళ బిల్లు రిజర్వేషన్ పై...
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల పెంపుపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
Next Story

