Sun Mar 08 2026 05:36:56 GMT+0530 (India Standard Time)
హాట్‌హాట్ గా సీడబ్ల్యూసీ సమావేశం
ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరుగుతుంది.

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరుగుతుంది. గత రెండు గంటలుగా జరుగుతున్న సమావేశంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీయేతర కుటుంబానికి అప్పగిచాలని కోరారు. ఈ సమావేశానికి జీ 23 నేతలు హజరు కావడంతో కొంత టెన్షన్ మొదలయింది. జీ 23 నేతలు మాత్రం ముకుల్ వాస్నిక్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని గట్టిగా కోరుతున్నారు.
ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన....
అయితే సీడబ్ల్యూసీ లో ఈ ప్రతిపాదనను ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళ్లాలని కోరుతున్నారు. రాహుల్ పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని అనేక మంది నేతలు కోరుతున్నారు. సోనియా, రాహుల్ పార్టీ పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరగడంతో ఢిల్లీలోని ఏఐసీసీ భవన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగాయి.
Next Story

