Sat Mar 07 2026 22:19:09 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా
ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో నేడు కాంగ్రెస్ ధర్నా చేయనుంది

ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో నేడు కాంగ్రెస్ ధర్నా చేయనుంది. నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోలు, గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఈ ధర్నాకు దిగనుంది. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి క్షీణించిపోవడం తదితర అంశాలపై ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ధరల పెరుగుదలకు....
ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు కూడా పాల్గొంటున్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలి వెళ్లారు. ధర్నాలో పాల్గొనడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రశ్నించనున్నారు.
Next Story

