Sat Dec 06 2025 00:08:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జమ్మూ కాశ్మీర్ కు రాహుల్ గాంధీ
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వెళ్లనుననారు. ఈరోజు నుంచి రెండు రోజుల పాటు రాహుల్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తారు. శ్రీనగర్ లో పార్టీ కీలక నేతలతో వీరు సమావేశం అవుతారు.
రానున్న ఎన్నికల్లో...
రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించడంపై వ్యూహాలను సిద్ధం చేస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతోనూ వారు భేటీ అవుగారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలసి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశమున్నందున ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై కూడా కూడా చర్చించనున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు మూడు విడతల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా నిర్వహించడంపై వీరు ఇతర పార్టీల నేతలతో చర్చించనున్నారు.
Next Story

