Fri Dec 05 2025 18:37:47 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ ఆఫీసుకు సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెకర్టరేట్ కు చేరుకున్నారు. ఆమె వెంట రాహుల్ , ప్రియాంకలు ఉన్నారు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెకర్టరేట్ కు చేరుకున్నారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఉన్నారు. తన ఇంటి నుంచి నేరుగా బయలుదేరిన సోనియా గాంధీ ఈడీ విచారణలో పాల్గొననున్నారు. ఈ విచారణలో ఐదుగురు అధికారులు పాల్గొననున్నారు. అందులో మహిళ అధికారి ఒకరు ఉన్నారని చెబుతున్నారు. ఈడీ అధికారులు సోనియా గాంధీ నుంచి స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు.
ఏఐసీసీ ఆఫీస్ వద్ద....
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెకర్టరేట్ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేయడంతో ఆమె విచారణకు వెళ్లారు. మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఆమెను విచారించనున్నారు. దీంతో ఏఐసీసీ కార్యాలయం వద్దకు పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. సోనియా విచారణను నిరసిస్తూ వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది.
Next Story

