Fri Dec 05 2025 12:24:53 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : సోనియాగాంధీకి కోర్టులో ఊరట
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊరట లభించింది.

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊరట లభించింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్లో, ఆమె భారతీయ పౌరురాలు కాకముందే మూడు సంవత్సరాలక్రితం పేరు ఓటర్ల జాబితాలో చేర్చాంటూ దాదాఖలైన పిటీషన్ పై విచారించిన కోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది. అదనపు ప్రధాన న్యాయమూర్తి వైభవ్ చౌరాసియా ఈ పిటిషన్ను తిరస్కరించారు.
భారత పౌరసత్వం పై...
ఈ నెల పదోతేదీన పిటీషనర్ వికాస్ త్రిపాఠి తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్, 1980 జనవరిలో సోనియా గాంధీ పేరు న్యూ ఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చారని, ఆ సమయంలో ఆమె భారతీయ పౌరురాలు కాదని కోర్టులో వాదించారు. జాబితాలో చేర్చడంపై విచారణ జరపించాలని పిటీషనర్ తరుపున న్యాయవాది కోరారు. అయితే ఈ పిటీషన్ పై విచారణను నిలిపివేస్తూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Next Story

