Thu Mar 19 2026 09:10:27 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ కీలక సమావేశాలు రేపటి నుంచి
ఈ నెల 26,27 తేదీలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి.

ఈ నెల 26,27 తేదీలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటక లోని బెల్గావిలో సమావేశాలు జరుగనున్నాయి. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈసమావేశానికి ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు హాజరు కానున్నారు.
కీలక అంశాలపై...
ఈసమావేశానికి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు,సిఎల్పీ లీడర్లు కూడా పాల్గొంటారు. జాతీయరాజకీయాలు,జమిలి ఎన్నికలతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణతోపాటు ఇండి కూటమిలో కలసి వచ్చే పార్టీలతో ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చించనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

