Tue Mar 17 2026 13:45:56 GMT+0530 (India Standard Time)
Congress : రాయబరేలి నుంచి రాహుల్.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన
రాయబరేలి, అమేధీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది

గాంధీ కుటుంబానికి పట్టున్న రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. కొద్దిసేపటిక్రితం రాయబరేలి, అమేధీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఉత్తర్ప్రదేశ్ లోని రాయబరేలి, అమేధీ రెండు నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉండేవి. అయితే గత ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆయన కేరళలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగడంతో అక్కడ గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు.
అమేధీ నుంచి...
ఈసారి రాయబరేలి, అమేధీ స్థానాలకు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ, అమేధీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చివరకు మాత్రం అమేధీ నుంచి కిషోర్ లాల్ శర్మను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎన్నికల్లో రాయబరేలి, వాయనాడ్ ల నుంచి పోటీ చేస్తున్నట్లయింది.
Next Story

